ఆమెకు అప్పటికే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ... భర్త ఆమెను వివిధ రకాలుగా వేధించడంతో... అతని నుంచి దూరమైంది. అలా భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమెకు మరో యువకుడు పరిచయం అయ్యాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తర్వాత పెళ్లి మాట ఎత్తగానే.. పరారయ్యాడు. ఈ సంఘటన మల్కాజగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  నాచారం పోలీస్ స్టేషన్ కి చెందిన ఓ మహిళ(23) కు కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమెకు ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. నాలుగు నెలలుగా ఆమె భర్తలో ప్రవర్తన వచ్చింది. భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో భరించలేక పిల్లలతో కలిసి మూడు నెలల క్రితం పుట్టింటికి చేరింది.

ఉత్తరప్రదేశ్ బరేలీ ప్రాంతానికి చెందిన ఆఫన్(19) వంట పనులు చేసుకుంటూ జవహర్ నగర్ లో నివసిస్తున్నాడు. అతడికి ఫేస్ బుక్ ద్వారా ఆమె పరిచయమ్యింది. ఇటీవల ఆమెకు జవహర్ నగర్ లోని ఓ ఇంటిలో పనిచేసే అవకాశం వచ్చింది. 

ఆమెను వివాహం చేసుకుంటానని, పిల్లలకు తండ్రిగా ఉంటానని నమ్మించాడు. ఆమె పనిచేసే ఇంటికి తరచూ యువకుడు రావడం కాలనీ వాసులు గమనించారు. అతనిని పట్టుకొని నిలదీయడంతో... ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో... బాధితురాలు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.