Asianet News TeluguAsianet News Telugu

నాగోల్ బండ్లగూడలో అశ్లీల నృత్యాలు: పరారీలో నిర్వాహకులు


హైద్రాబాద్ నాగోల్ బండ్లగూడ ఫంక్షన్ హాల్లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఏస్టేట్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

police arrested several persons in Nagole Bandlaguda for Obscene dances
Author
Hyderabad, First Published Oct 12, 2021, 11:45 AM IST

హైదరాబాద్:  hyderabad నాగోల్ bandlaguda ఫంక్షన్ హాల్‌లో  Obscene dances నిర్వహిస్తుండగా  పలువురిని పోలీసులు  అరెస్ట్ చేశారు. ఓ రియల్ఏస్టేట్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. ఈ విషయమై పక్కా సమాచారం అందుకొన్న పోలీసులు ఫంక్షన్ హాల్‌పై  సోమవారం నాడు రాత్రి దాడి చేసి పట్టుకొన్నారు.

also read:Mumbai Drugs Case : క్రూయిజ్ లో రేవ్ పార్టీకి ‘శానిటరీ న్యాప్ కీన్స్’లో డ్రగ్స్ సరఫరా...

అనమతులు లేకుండా  real estate సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో  రియల్ ఏస్టేట్ సంస్థకు చెందిన నిర్వాహకులు, ఈవెంట్ ఆర్గనైజర్లు పరారయ్యారు. ఈ విషయమై పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. మరో వైపు ఈవెంట్ ఆర్గనైజర్లు, రియల్ ఏస్టేట్ సంస్థ ప్రతినిధుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నిబంధనలకు విరుద్దంగా ఈ రకమైన కార్యక్రమాలను నిర్వహించే వారిపై చర్యలు తీసుకొంటామని పోలీసులు గతంలోనే ప్రకటించారు.శివరాత్రి, న్యూ ఇయర్ సందర్భంగా ఈ తరహా డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ తరహా ఈవెంట్ల నిర్వహణపై పోలీసులు కన్నేసి ఉంచుతారు. అయితే పోలీసుల కళ్లుగప్పి అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీలు సాగుతున్నాయి. వీకేండ్‌లలో ఎక్కువగా ఈ తరహ పార్టీలు జరుగుతాయి.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios