హైద్రాబాద్‌లో దారుణం: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్
హైద్రాబాద్ నగరంలోని మెఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలికను క్యాడ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. ఒక్క రాత్రి బాలికను హైద్రాబాద్ కు దూరంగా తీసుకెళ్లాడు. మరునాడు బాలికను వదిలివేశాడు. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ పిర్యాదు మేరకు పోలీసులు క్యాబ్ డ్రైవర్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: Hyderabad నగరంలోని Moghalpura పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకొంది. 13 ఏళ్ల మైనర్ బాలికను Lukman అనే క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుపై పోలీసులు అరెస్ట్ చేశారు.
మొఘల్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో Mnor Girl ను క్యాబ్ Driver కిడ్నాప్ చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఒక రోజు రాత్రి మొత్తం బాలిక ఇంటికి రాలేదు. బాధితురాలిని రాత్రిపూట ఎక్కడ ఉంచారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితురాలిపై లైంగిక దాడి చోటు చేసుకొందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చౌటుప్పల్ లేదా కొందుర్గు ప్రాంతాల్లో ఉంచారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారని సమాచారం.
హైద్రాబాద్ లోని Amnesia పబ్ ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే విషయం వైద్య పరీక్షల్లో తేలనుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను హైద్రాబాద్ కు సమీపంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే ఉంచారని బాధితురాలు తమ కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలి స్టేట్ మెంట్ ను కూడా పోలీసులు సేకరించారు.ఈ స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ సహా మరో ముగ్గురిని పోలీసులు సీజ్ చేశారు.
గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ ఏడాది మే 19న చోటు చేసుకొంది. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. Guntur జిల్లాలోని వెంగళాయపాలెం గ్రామానికి చెందిన బాలిక సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని గుర్తించిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు బాలికను నమ్మించి నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
also read:బాలికపై అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
బాయ్‌ఫ్రెండ్ స్పృహ తప్పి పడిపోయాడని బాలికకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం నమ్మిన బాలిక ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన చోటుకు చేరుకుంది. వారిని నమ్మి అతడి బైక్ పై వెళ్లింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని లాడ్జీలో లో బాధితురాలి బోయ్ ఫ్రెండ్ స్పృహ తప్పి ఉన్నాడని నమ్మించి అక్కడికి తీసుకెళ్లారు. ఆ బాలికను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత బాలికకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు. మత్తులోకి జారుకున్న తర్వాత బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.
రాత్రిపూట నీరసంగా బాలిక ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులను బాలికను నిలదీస్తే ఆమె అసలు విషయం చెప్పింది. బాలికను తీసుకొని పేరేంట్స్ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ముగ్గురు కూడు గుంటూరుకి సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ గా పోలీసులు గుర్తించారు.