Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో రాత్రి నుంచి నిరసనలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజా సింగ్ ఇంటివద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Police Arrested BJP MLA Arrest Raja Singh
Author
First Published Aug 23, 2022, 10:11 AM IST

మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై  తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిరసనలు చేలరేగాయి. మునావర్ ఫరూఖీకి సంబంధించిన కామెడీ షో కి సంబంధించి రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అసలేం జరిగింది..
హైదరాబాద్‌లో హాస్యనటుడు మునావర్ ఫరూఖీ‌ షో ఇటీవల ఒక ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ షోను ఎట్టి పరిస్థితుల్లోనే  నిర్వహించడాన్ని అడ్డుకుంటామని రాజాసింగ్ గత కొద్దిరోజులుగా రాజాసింగ్ హెచ్చరిస్తూ వచ్చారు. ఫరూకీ ప్రదర్శనను ఆపాలని డిమాండ్ చేశారు. లేకుంటే వేదిక వద్ద ఉన్న సెట్‌ను తగలబెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గతవారం భారీగా పోలీసు బందోబస్తు మధ్య హైదరాబాద్‌లో మునావర్ ఫరూఖీ‌ షో  సాగింది. 

నగరంలో నిరసనలు..
అయితే మునావర్ ఫరూఖీ నిర్వహించిన ప్రదర్శనపై కౌంటర్‌గా రాజాసింగ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఇందులో మహ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్ కామెంట్స్ చేశారని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ముస్లింలు నిరసనకు దిగారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కార్యాలయం ఎదుట, నగరంలో పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజా సింగ్‌‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బషీర్ బాగ్‌లోని కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఈ క్రమంలోనే రాజా సింగ్‌పై నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios