Asianet News TeluguAsianet News Telugu

చైల్డ్ పోర్నో గ్రఫీ చూసినా నేరమే..


ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌ మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసినా, చూసినా, డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ చేసినా... నేరమే అని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  

police arrest the youth who searched child obscene video
Author
Hyderabad, First Published Aug 10, 2020, 7:33 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభం, శుభం తెలియని చిన్నారులు లైంగిక దాడులకు గురౌతున్నారు. వాటికి చైల్డ్ పోర్రో గ్రఫీ ప్రధాన కారణంగా గుర్తించిన ప్రపంచ దేశాలు వాటిపై నిషేధం విధించాయి. కాగా.. ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌ మీడియాలో సాగుతున్న చైల్డ్‌ పోగ్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. 

చైల్డ్‌ సెక్స్‌వల్‌ అబ్యూజ్డ్‌ మెటీరియల్‌ను (సీఎస్‌ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్‌ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నగరంలోని తార్నాక ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫిరోజ్, కాచిగూడ వాసి ప్రశాంత్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. 

ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌ మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసినా, చూసినా, డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ చేసినా... నేరమే అని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  

అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ ఎన్‌సీఎంఈసీని ఏర్పాటు చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తప్పిపోతున్న చిన్నారులు, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించడానికి ఈ సంస్థ పని చేస్తోంది. చిన్నారులకు సంబంధించి అశ్లీల చిత్రాలు, వీడియోలు, సాహిత్యం తదితరాలను చైల్డ్‌ పోర్నోగ్రఫీగా పరిగణిస్తారు. 

దీన్ని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ కార్యకలాపాలు మరింత ముమ్మరం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు వయస్సున్న ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరు, ప్రతి ఐదుగురు బాలురులో ఒకరు లైంగిక దాడులకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్‌ అధ్యయనంలో తేలింది. ఆన్‌లైన్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనేది అత్యంత వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది.

 ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకండ్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్‌ అవుతోంది. వివిధ సెర్చ్‌ ఇంజన్లలో జరుగుతున్న సెర్చ్‌ల్లో 25 శాతం చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించినవే. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే 2 వరకు ఇంటర్‌నెట్‌లో  25 వేల చైల్డ్‌ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు, చిత్రాలు అప్‌లోడ్‌ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌సీఎంఈసీ ఆన్‌లైన్, సోషల్‌మీడియాలో ఉన్న చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సాంకేతిక నిఘా వేసి ఉంచుతోంది.  

ఎన్‌సీఎంఈసీ నుంచి చైల్డ్‌ పోర్నోగ్రఫీ నిందితుల జాబితా అందుకున్న ఎన్సీఆర్బీ అధికారులు ఆ వివరాలను రాష్ట్రాల వారీగా విభజించి, ఆ సమాచారాన్ని ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. 2019లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ అప్‌లోడ్‌ చేసిన తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఇటీవల ఎన్సీఆర్బీ నుంచి రాష్ట్ర సీఐడీ అధికారులకు అందగా..   వీరు ఆ నిందితుల జాబితాలను ఆయా స్థానిక పోలీసులకు పంపించారు. 

ఇలా ఇద్దరి వివరాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అందగా..  ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించారు. గతేడాది ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లోకి ఓ చైల్డ్‌  పోర్న్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన తార్నాక వాసి మహ్మద్‌ ఫిరోజ్, చిన్నారుల అశ్లీల చిత్రాలను ఓ సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసిన కాచిగూడ వాసి ప్రశాంత్‌ కుమార్‌ను ఇలానే పట్టుకున్నారు. వీరిద్దరిని గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. మిగిలిన 13 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో ఆయా జిల్లాల పోలీసులకు ఆ సమాచారం సీఐడీ ద్వారా అందింది. వీరినీ అరెస్టు చేయడానికి సన్నాçహాలు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios