Asianet News TeluguAsianet News Telugu

ఆమె పేరుతో ఖాతా తెరిచి.. టెక్కీకి వల.. చివరకు..

ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా తెరిచాడు. 
 

police arrest the youth who cheated software engineer for money
Author
Hyderabad, First Published Jun 12, 2020, 8:15 AM IST

అతను ఓ అబ్బాయి.. కానీ సోషల్ మీడియాలో ఓ యువతిగా ఖాతా తెరిచాడు. దానితోనే ఓ టెక్కీ వల వేశాడు.తన ఫొటోలు  అంటూ డమ్మీవి పంపించి.. అతని దగ్గర నుంచి మాత్రం నిజమైన ఫోటోలు లాగాడు. నగ్నంగా ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఆ తర్వాత వాటిని చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్‌కిరణ్‌ (20) నగరంలోని ఓ కాలేజీలో  బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా తెరిచాడు. 

దీని ద్వారా కాచిగూడ ప్రాంతంలో నివసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఈ రిక్వెస్ట్‌ వచ్చింది సదరు యువతి నుంచే అని భావించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ యాక్సెప్ట్‌ చేశాడు. ఇలా కొన్నాళ్ల పాటు యువతి మాదిరే చాటింగ్స్‌ చేశాడు. తన ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ వీడియో కాల్స్, ఫోన్‌ కాల్స్‌ లేకుండా జాగ్రత్తపడ్డాడు. 

 ఆ తర్వాత టెక్కీని నమ్మించడం కోసం ఓ అమ్మాయి అర్థనగ్న ఫోటోలు పంపి అవి తనవేనంటూ నమ్మించాడు.అలాగే ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దగ్గర నుంచి కూడా అతని నగ్న ఫోటోలు సేకరించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటూ చెప్పడం మొదలుపెట్టాడు.

అందుకే వ్యక్తిగత ఫొటోలను సైతం షేర్‌ చేశానంటూ చాటింగ్‌ మొదలెట్టాడు. ఈ ప్రస్తావనతో హడలిపోయన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి పేరుతో ఉన్న పవన్‌ కిరణ్‌ ఖాతాను బ్లాక్‌ చేశాడు. దీంతో వాట్సాప్‌ ద్వారా రంగంలోకి దిగిన నిందితుడు తనను పెళ్లి చేసుకోమంటే బ్లాక్‌ చేసి మోసం చేస్తున్నావంటూ సందేశాలు పంపాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. 

ఆ తర్వాత ఈ విషయం తన అన్న వద్దకు వెళుతోందని, ఆయనే మాట్లాడతారంటూ సందేశం పెట్టిన పవన్‌ మూడో పాత్రలోకి దిగాడు. బాధితుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఫోన్లు చేయడం ప్రారంభించిన పవన్‌ ‘అన్న’ మాదిరిగా మాట్లాడుతూ బెదిరించాడు. తన వద్ద ఉన్న అతడి వ్యక్తిగత ఫొటోలను సైతం మచ్చుకు పంపిస్తున్నానంటూ డబ్బు డిమాండ్‌ చేశాడు. 

దీంతో రూ.3.5 లక్షలు చెల్లించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలిపెట్టని పవన్‌ మరికొంత మొత్తం ఇవ్వాలని పదేపదే ఫోన్లు చేశాడు. దీంతో బాధితుడు ఇటీవల సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. చివరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios