బరువు తగ్గేందుకు ఇటీవల కాలంలో చాలా మంది యువతులు కొన్ని సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వారి సమక్షంలో బరువు తగ్గేందుకు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అయితే... అలాంటి వారి అవసరాన్ని అవకాశంగా చేసుకోని.. యువతుల పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. యువతులను ఎక్కడ పడితే అక్కడ తాకడం లాంటివి చేసేవాడు. ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. చివరకు బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బరువు తగ్గిస్తామని చెబుతూ అమాయక ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సాజిద్ అనే వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . మల్కాజిగిరి లో నివసిస్తున్న ఓ యువతి బరువు తగ్గించుకోవాలని TRUE WEIGHT అనే సంస్థని ఆశ్రయించింది. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తరువాత సాజిద్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి ఆమేతో అసభంగా ప్రవర్తించాడు , పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాసిడ్ పోస్తానని బెదిరించాడు . 

యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మల్కాజిగిరి పోలీసులు సాజిద్(37) ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు . గతంలో కూడా సాజిద్ చాలా మంది యువతులతో ఈ విధంగానే ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా... నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.