గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ లో వరస నేరాలకు పాల్పడుతూ చాలా సార్లు జైలుకు వెళ్లి వచ్చిన ఓ నిందితుడు తాజాగా.. హైదరాబాద్ లో మరోసారి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ లోని తన అత్తగారింటికి వచ్చి.. చేతి ఖర్చుల కోసం ఓ పాన్ షాపు, మరో చికెన్ దుకాణంలో చోరీ కి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  సిరిసిల్లలోని సుందరయ్యనగర్ కు చెందిన గిడ్డూ సింగ్ అలియాస్ గోవింద్ సింగ్(35) స్థానికంగా నేరాలకు పాల్పడి 21సార్లు అరెస్టు అయ్యాడు. రెండు హత్య కేసులు, అత్యాచారం కేసు, గుడుంబా అక్రమ రవాణా కేసులు, చోరీ కేసులు ఉన్నాయి.

ఈ జనవరిలో జైలుకెళ్లి ఫ్రిబవరిలో విడుదలైన ఈ నిందితుడు ఇటీవల హైదరాబాద్ నగరంలోని రారజీవ్ గాంధీనగర్ లో ఉండే అత్తారింటికి వచ్చాడు.  చేతి ఖర్చుల కోసం ఎల్బీనగర్ లోని బస్టాండ్ వద్ద ఉన్న ఓ పాన్ దుకాణంలో చోరీ చేయడంతో మన్సూరాబాద్ సాయినగర్ లోని చికెన్ దుకాణంలో గల్లా పెట్టెను కూడా కొట్టేశాడు. సీసీపుటేజ్ ఆధారంగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు.