Asianet News TeluguAsianet News Telugu

కందులు కొనుగోలు చేయాలంటూ ఆందోళన.. రైతుల అరెస్ట్

మోత్కూరులో కంది రైతులు ఆందోళన చేపట్టారు. కందులను కొనుగోలు చేయాలంటూ మార్కెట్‌ గేట్లు తెరిచి ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే అనుమతి లేకుండా గేట్లు తెరిచారంటూ వైస్‌ చైర్మన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

police arrest the red gram dal farmers in mothukuru
Author
Hyderabad, First Published Mar 2, 2020, 11:40 AM IST

కందులు కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేశారని రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన యాదాద్రి-భువనగిరి జిల్లాలోని మోత్కూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... గత కొంతకాలంగా కంది రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము ఎంతో కష్టపడి పండించిన పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో.. శీలానికి వెలకట్టి..

ఈ నేపథ్యంలో సోమవారం మోత్కూరులో కంది రైతులు ఆందోళన చేపట్టారు. కందులను కొనుగోలు చేయాలంటూ మార్కెట్‌ గేట్లు తెరిచి ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే అనుమతి లేకుండా గేట్లు తెరిచారంటూ వైస్‌ చైర్మన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాగా.. మోత్కురులో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్రం ప్రభుత్వం కందులకు మంచి మద్దతు ధర ప్రకటించినప్పటికీ... ఆ ధరకి కందులను మాత్రం అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో.. ఆందోళన చేపట్టారు. మార్కెట్ గేట్లు ఎత్తి మరీ కందులకు మార్కెట్ లోపలికి రైతులు తీసుకువెళ్లారు. అది మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కి నచ్చకపోవడంతో.. రసాభాసగా మారింది. ఆయన రైతులపై కన్నెర్ర  చేశారు.  దీంతో ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios