Asianet News TeluguAsianet News Telugu

నీ భార్యను నాకు వదిలేయ్... వివాహిత భర్తకు బెదిరింపులు..

ఆ పై యువతిని నేరుగా కలుస్తానని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.  ఆపై యువతిని నేరుగా కలుస్తానని చెప్పగా... ఆమె నిరాకరించడంతోపాటు అతని మెసేజ్ లకు స్పందించడం మానేసింది

Police Arrest the man who Threaten Couple in nagole
Author
Hyderabad, First Published Apr 1, 2021, 9:24 AM IST

ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా సృష్టించి.. ఓ భార్య భర్తలను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని తాజాగా రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నాగోలులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి మహ్మద్ కరీం(25) దుబాయ్ లో భవన నిర్మాణ పనుల్లో ఉపాధి పొందుతున్నాడు. తమ సామాజికవర్గానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్ లో నల్గొండకు చెందిన యువతి ఫోటో చూసి ఆమెకు మెసేజ్ లు పంపాడు. అనంతరం ఆమె ఫేస్ బుక్ లోకి వెళ్లి ఫోటోలను స్క్రీన్ షాట్ తీశాడు. అనంతరం సదరు యువతితో  జరిపిన సంభాషణలను ఓ వీడియోగా రూపొందించారు.

ఆ పై యువతిని నేరుగా కలుస్తానని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.  ఆపై యువతిని నేరుగా కలుస్తానని చెప్పగా... ఆమె నిరాకరించడంతోపాటు అతని మెసేజ్ లకు స్పందించడం మానేసింది. ఆ తర్వాత యువతికి పెళ్లైన విషయాన్ని కరీం తెలుసుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న అతడు ఆమె పేరిట నకిలీ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను సృష్టించాడు.

ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మార్ఫింగ్ చేసిన ఫోటోలు అందులో అప్ లోడ్ చేశాడు. అనంతరం సదరు మహిళ భర్తకు సైతం ఫోన్ చేసి నీ భార్యను నాకు వదిలేయ్ అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. వదిలిపెట్టకుంటే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు షేర్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios