వీళ్లు మామూలు బావ, మరదళ్లు కాదు. కిలాడీలు.. సినీ ఫక్కీలో ఒకరు ప్లాన్ వేస్తే.. మరొకరు అంతే పక్కాగా ప్లాన్ అమలు చేస్తారు. ఒకప్పుడు అప్పు తీసుకొని జీవనం సాగించిన వీరు.. తెలివిగా చోరీలు చేసి.. అవతలివారికి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఈ సంఘటన ఎల్బీనగర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బండ్లగూడలోని కృషినగర్ లోని ఓ ఇంట్లో ఓ బాలిక నాలుగేళ్లు పనిమనిషిగా చేసింది. 2018లో ఆ ఇంటి లాకర్ లో నుంచి దాదాపు రూ.59లక్షలు చోరీ చేసింది. ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు బాలిక తన బావతో కలిసి ఈ డబ్బులు చోరీ చేయడం గమనార్హం.

కాగా.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ బావ, మరదళ్లను పోలీసులు పట్టుకోగలిగారు. ఆ డబ్బుతో వారు జల్సాలు చేసుకున్నట్లు తెలిసింది. దాదాపు రూ.2.35 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. విలాసవంతంగా ఖర్చులు చేశారు. దాదాపు రూ.20లక్షలు స్నేహితులకు అప్పుగా ఇచ్చాడు.

కాగా.. తాజాగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితు ల నుంచి డబ్బు రికవరీ చేసే పనిలో ఉన్నామని చెప్పారు.