ఖమ్మం/ నల్లగొండ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు 16 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చి ఓ శిశువుకు జన్మ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో యువకుడిపై బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.

ఆ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. ఆ గ్రామానికి చెందిన బాలికు పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడేనికి చెందిన కొవ్వాసి అనిల్ (22)తో ఏడాది క్రితం పరిచయమైంది. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై అనిల్ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. బాలిక గర్బం దాల్చిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు అనిల్ కు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని అడిగారు. అందుకు అతను నిరాకరించాడు. దాంతో బాధితురాలు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిల్ పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాలికపై బాలుడి అత్యాచారం...

నల్లగొండ జిల్లా నాంపల్లిలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో గంజాయి కేసులో నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు విచారించారు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు నాంపల్లిలోని ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న 13 ఏళ్ల బాలికను, బాలుడిని తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. లైంగిక దాడి చేసిన యువకుడిపై కేసు నమోదు చేశారు నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు బాలురపై కూడా కేసు నమోదు చేశారు.