మైనర్ బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో బాలికపై ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా.. ఆ కామాంధుడి కారణంగా బాలిక గర్భం దాల్చడం గమనార్హం. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం చింతకుంట గ్రామానికి చెందిన ముప్పయ్యేళ్ల వ్యక్తి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఇటీవల బాలిక గర్భం దాల్చిన విషయం వెలుగు చూసింది.

విషయం తెలుసుకున్న  బాలిక తల్లిదండ్రులు.. గట్టిగా నిలదీయడంతో.. ఆమె విషయం చెప్పింది. దీంతో.. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 

బోధన్‌ ఏసీపీ, రుద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్‌ఐ అనిల్‌రెడ్డి విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.