ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకోగా.. హత్య జరిగిన నాలుగు నెలల తర్వాత విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పాపన్న మండలం అంబ్రియా తండా అనుబంధ గ్రామం సోమ్లా తండాకు చెందిన యువతి ఖోలా శిరీష(18) టేక్మాల్ మండలం ఎల్లుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుమ్మరి వీరేశం ప్రేమ పేరిట యువతి వెంట పడ్డాడు. రోజూ ఆటోలో స్కూల్ కి తీసుకువచ్చేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గతేడాది సెప్టెంబర్ లో యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లాడు. అక్కడ సహజీవనం చేయడం మొదలుపెట్టాడు.

అయితే... వీరేశం కి గతంలో పెళ్లి అయ్యింది. భార్య చనిపోవడంతో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తెలీకుండా శిరీషను మోసం చేయడం మొదలుపెట్టాడు. తన రెండో భార్యకు విషయం తెలిస్తే.. తాను ఊరుకోదని శిరీషను వదిలించుకోవాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. యువతిని తీసుకువెళ్లి నదిలో తోసేసి హత్య చేశాడు.

కొద్ది రోజుల తర్వాత యువతి శవం బయటపడింది. శవ పరీక్ష ద్వారా ఆ శవం శిరీష దని పోలీసులు తెలసుకున్నారు. ఈ క్రమంలో శిరీష కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు లో భాగంగా ఆటో డ్రైవర్ ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.