వాళ్లిద్దరూ ప్రేమికులు. దాదాపు 10ఏళ్ల పైనుంచే ఒకరితో మరొకరికి పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే... ఏ ప్రేమికులైనా తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువెళ్లాలని... పెద్దలను ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంటారు. కానీ ఈ ఫోటోలో ఉన్న ప్రేమ జంట మాత్రం అలాకాదు.

పెళ్లి సంగతి పక్కనపెట్టి... లగ్జరీ లైఫ్ కోసం ఇద్దరూ ఒకరి మరొకరు సాయం చేస్తూ.. రూపాయిలు కూడపెట్టుకుంటున్నారు. అయితే... ఆ రూపాయిలు దొంగతనాలు చేసి కూడపెట్టుకుంటున్నారు... ముఖ్యంగా ఒంటరి స్త్రీలను టార్గెట్ చేసి వీరు దోపిడీలు చేస్తుండటం విశేషం. కాగా... వీరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి  వెళితే..  ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామానికి చెందిన భానువికాస్‌ ప్రస్తుతం మేడిపల్లిలోని కమలానగర్‌లో ఉంటున్నాడు. వరంగల్‌ జిల్లా ఆరెపల్లిలో పదో తరగతి చదివిన సమయంలో భానువికాస్‌కు అతని సోదరి క్లాస్‌మేట్‌ మానస పరిచయంతో స్నేహితులుగా మారారు. ప్రస్తుతం ఆమె ఉప్పల్‌ శాంతినగర్‌లో ఉంటోంది. 2012– 16 మధ్యకాలంలో యనంపేటలోని ఎస్‌ఎన్‌ఐటీ కాలేజీ నుంచి బీటెక్‌ ఈసీఈ చదివిన భానువికాస్‌ ప్రస్తుతం జోమాటాలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

Also Read నగల కోసం వృద్ధురాలిని చంపి.. శవాన్ని తీసుకెళ్లి.....
 
లగ్జరీ లైఫ్ కోసం భాను వికాస్ తన ప్రేయసి మానసతో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. ఒంటరి మహిళలే వీళ్ల టార్గెట్. నగరానికి కొంచెం దూరంగా కొత్తగా కట్టిన నిర్మాణాలను ఎంచుకుంటారు. బైక్ మీద వెళ్లి ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారో గుర్తిస్తారు. అనంతరం అక్కడకు వెళ్లి.. మాటల్లో దింపుతారు. తర్వాత మంచినీరు కావాలని చెప్పి.. ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి... ఒంటి మీద నగలతో ఉడాయిస్తారు.

చాలా కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ జంట గతేడాది డిసెంబర్ 19వ తేదీన ఓ మహిళ మెడలో గొలుసు కొట్టేశారు. ఆ మహిళ ఫిర్యాదుతో తాజాగా ఈ దొంగ ప్రేమ జంట  పోలీసులకు చిక్కింది.