ఒంటి మీద ఉన్న నగల కోసం దుండగులు ఓ వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకువెళ్లి సదరు మహిళ కూతురి ఇంటి ముందు పడేయడం గమనార్హం. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కందుకూరు మండలం నేదునూరుకు చెందిన సర్గారి బాలమణి(80) గ్రామం చివరనున్న తన కూతురి ఇంటికి కొద్ది దూరంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. 

Also Read ప్రేమ పేరిట ఇంజినీరింగ్ విద్యార్థినికి వల.. బయటకు తీసుకువెళ్లి.....

మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వృద్ధురాలి మనువడు (కూతురి కొడుకు) నరేందర్‌రెడ్డి నగరంలో కూరగాయల మార్కెట్‌కు వెళదామని ఇంటి బయటకు రాగానే, వాకిట్లో అమ్మమ్మ బాలమణి విగతజీవిగా కన్పించింది. 

బాలమణి ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాల కోసమే దుండగులు ఆమెను హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, క్రైం బ్రాంచ్‌ సీఐలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.