Asianet News TeluguAsianet News Telugu

కరోనా తగ్గిస్తానంటూ డబ్బులు వసూలు.. దొంగ బాబా అరెస్ట్

వారి సమస్యలు తీర్చుతానంటూ వారికి తాయత్తులు కట్టి డబ్బు సంపాదించుకునే వాడు. ప్రజల్లో కరోనా భయం ఎక్కు కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్నవయిపోవడంతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు.

police arrest the baba who cheating people with name of coronavirus
Author
Hyderabad, First Published Jul 25, 2020, 2:25 PM IST

దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతోంది. తెలంగాణలోనూ ఈ వైరస్ ఉధృతి ఎక్కువగానే ఉంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే.. ప్రజల్లో ఉన్న భయాన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఓ వ్యక్తి కరోనా తగ్గిస్తానంటూ ప్రజల నుంచి డబ్బులు గుంజాడు. కాగా.. ఆ కరోనా బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మియాపూర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మియాపూర్‌లోని హఫీజ్‌పేటలో కరోనా వ్యాధిని నమం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కరోనా బాబా అలియాస్‌ ఇస్మాయిల్‌ బాబా అనే వ్యక్తి భక్తుల్లో ఉండే భయాన్ని ఆసరాగా తీసుకుని, వారి సమస్యలు తీర్చుతానంటూ వారికి తాయత్తులు కట్టి డబ్బు సంపాదించుకునే వాడు. ప్రజల్లో కరోనా భయం ఎక్కువయిపోవడంతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు.

కరోనా రాకుండా చేస్తానని వారిని నమ్మించాడు. కరోనాకు మందు ఇస్తానంటూ రూ.12 వేల చొప్పున భక్తుల నుంచి వసూలు చేశాడు. అయితే, అతడు డబ్బులు తీసుకున్నప్పటికీ కరోనాకు మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇస్మాయిల్‌ బాబాను హఫీజ్‌పేట్‌ హనీఫ్‌ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios