వాళ్లు తమ చెల్లిని అపూరంగా పెంచుకున్నారు. ప్రాణం ఎక్కువగా చూసుకున్నారు. అయితే.. ఆ చెల్లెలు వేరే కులం వాడిని ప్రేమించింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ప్రేమించిన వాడితో లేచిపోయింది. పెళ్లిచేస్తామని నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని ప్రయత్నించారు. అయినా కుదరలేదు. ఈ సారి యువతి ప్రేమికుడితో లేచి పోయి పెళ్లి చేసుకుంది. దీంతో.. ఆమె అన్నలు.. చెల్లెలి ప్రేమికుడిపై పగ పెంచుకున్నారు. అతని కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని చూశారు. ఈ సంఘటన చౌటుప్పల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చౌటుప్పల్ లోని గ్రామానికి చెందిన గడ్డం నవనీత అదే గ్రామానికి చెందిన గొండిగళ్ల గాలయ్య కుమారుడు బాబును ప్రేమించింది. ఈ విషయం పెద్దలకు తెలిసింది. ఆ క్రమంలో గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ కనిపెట్టిన యువతి కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు.

ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తామని మాట ఇచ్చారు. అయితే.. ఆ మాట మార్చి మరో పెళ్లి చేయాలని చూశారు. అయితే.. యువతి ప్రేమ విషయం తెలిసిన వరుడు కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత యువతి తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.
దీంతో చెల్లెలి భర్త కుటుంబంపై ఆమె అన్నలు పగ పెంచుకున్నారు.

ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నారు. ప్లాన్ ఫ్రకారం బాబు తండ్రిని మాటు వేసి మరీ చంపేశారు. కాగా.. బాబు కుటంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల దగ్గర నుంచి కత్తి, స్కూటీ, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్‌ నిమిత్తం నల్లగొండ కోర్టుకు తరలించారు.