Asianet News TeluguAsianet News Telugu

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Police Arrest byri naresh who made comments against lord ayyappa reports
Author
First Published Dec 31, 2022, 12:10 PM IST

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోలీసులు నరేష్‌ను ట్రేస్ చేశారు. వరంగల్ నుంచి కరీంనగర్ రూట్ వైపు వెళ్తుండగా వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నరేష్‌ను ప్రస్తతుం కొడంగల్ తరలిస్తున్నట్టుగా సమాచారం. అయితే నరేష్‌పై కొండగల్‌తో పాటు పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, పలువురు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

బైరి నరేష్ అనే నాస్తికుడు అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. డిసెంబరు 19న వికారాబాద్ జిల్లా రావులపల్లిలో జరిగిన సభలో అయ్యప్ప స్వామిపై నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మరికొన్ని చోట్ల కూడా అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మతపరమైన మనోభావాలను టార్గెట్ చేయడం, అవహేళన చేయడం, దెబ్బతీయడం అనే ఉద్దేశ్యంతో హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం అందరికీ ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.

అయితే నరేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బైరి నరేష్ యూట్యూబ్ చానల్‌ను నిషేధించాలని కోరుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios