బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. క‌ర్మ‌న్‌ఘాట్ ఆంజ‌నేయ స్వామి ఆలయానికి వెళ్తున్న ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. 

బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. క‌ర్మ‌న్‌ఘాట్ ఆంజ‌నేయ స్వామి ఆలయానికి వెళ్తున్న ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ఎల్‌బీ నగర్ టోల్ గేట్ వద్ద ర‌ఘునంద‌న్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్ది రోజుల కిందట చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేడు క‌ర్మ‌న్‌ఘాట్ హ‌నుమాన్ టెంపుల్ వ‌ద్ద ధర్నా తలపెట్టింది. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎలాగైనా ధర్నా నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆలయం వైపుకు వెళ్తున్న బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. క‌ర్మ‌న్‌ఘాట్ టెంపుల్ వ‌ద్ద పోలీసులు భారీ మోహ‌రించారు.

ఇక, కొద్ది రోజుల కిందట గోవులను తరలిస్తున్న వాహనాన్ని ఓ వర్గానికి చెందిన వారు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్​లోని karmanghat గోరక్షక సేవాసమితి సభ్యులు TKR కమాన్ వద్ద వాహనాన్ని అడ్డగించారు. Gau Rakshaks సభ్యులు గోవులను తరలిస్తున్న వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకొన్నారు. వాహనాలు దెబ్బతినడంతో పాటు గోరక్షకులపై తరలింపుదారులు దాడికి పాల్పడ్డారు. గోరక్షకుల నుంచి తప్పించుకునేందుకు తరలింపుదారులు దగ్గరలోని హనుమాన్ ఆలయంలో తలదాచుకున్నారు. 

వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ యువకులు రాత్రంతా నిరసన చేపట్టారు. తమపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే Arrest చేయాలని పోలీసులను గోసంరక్షకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాత్రి 9 గంటల నుండి ప్రారంభమైన ఆందోళన బుధవారం నాడు ఉదయం 3 గంటల వరకు కొనసాగింది.ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మీర్‌పేట, సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఇరువర్గాలకు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.