Asianet News TeluguAsianet News Telugu

Yadadri: వికలాంగుడికి గృహలక్ష్మీ అందించాలని కేటీఆర్ ఆదేశం.. రాష్ట్రంలో తొలి ప్రొసీడింగ్

యాదాద్రిలోని పోచంపల్లిలో కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. అక్కడే బీదరికంతో బాధపడుతున్న, సొంతిళ్లు లేని చుక్క నరేశ్‌ కుటుంబానికి సొంతిళ్లు కల నెరవేరడానికి మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గృహలక్ష్మి పథకం కింద ఆ దంపతులకు రూ. 3 లక్షల ప్రొసీడింగ్స్‌ను అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 
 

pocharam worker got first gruhalaxmi scheme cheque kms
Author
First Published Aug 14, 2023, 5:48 AM IST

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ, 10వ తేదీల్లో మీ సేవలు కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో ప్రజలు గృహలక్ష్మీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. తొలి ప్రొసీడింగ్ ఎక్కడ అందిందో తెలుసా? యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామ నివాసి, వికలాంగుడు చుక్క నరేశ్, పావని దంపతులు తొలి గృహలక్ష్మీ ప్రొసీడింగ్స్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అందుకున్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు నరేశ్ ఇంటికి వెళ్లి మరీ రూ. 3 లక్షలకు సంబంధించి పత్రాలను అందజేశారు.

మంత్రి కేటీఆర్ శనివారం పోచంపల్లి పర్యటించారు. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అయితే, అక్కడే పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్  కుటుంబం గురించి తెలుసుకున్నారు. వారి కుటుంబ దీన స్థితిని అర్థం చేసుకుని చలించారు. వారికి సొంతిళ్లు లేదనే తెలుసుకున్న మంత్రి కేటీఆర్ గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షల ప్రొసీడింగ్‌ను వారికి అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Also Read: ఈ నెల 18న చేవేళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ, హాజరుకానున్న ఖర్గే.. అదే వేదికపై పార్టీలోకి చంద్రశేఖర్

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కలిసి నరేశ్ ఇంటికి ఆదివారం వెళ్లారు. మన రాష్ట్రంలోనే గృహలక్ష్మి తొలి ప్రొసీడింగ్స్‌ను చుక్క నరేశ్ దంపతులకు అందించారు. దంపతులు సంతోషంలో మునిగిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios