తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ ప్రారంభించారు. 

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ ప్రారంభించారు. గురువారం స్పీకర్ ఎన్నికలకు సంబంధించి పోచారం ఒక్కరే నామినేషన్ వేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతో శాసనసభాపతిగా పోచారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభా నాయకుడు కేసీఆర్, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తదిరత సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సభ్యులు పోచారంను అభినందించారు.