Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లి జిల్లా: నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌‌ను ప్రారంభించిన మోడీ

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అతి తక్కువ సమయంలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేసిన అధికారులను, కార్మికులను ఆయన అభినందించారు. 
 

pm Narendra Modi launches floating solar power plant
Author
Peddapalli, First Published Jul 30, 2022, 7:37 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి రంగంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉజ్వల భవిష్యత్తు కోసం పరుగులు పెడుతుందన్నారు. 70 వేల మెగావాట్ల సామర్థ్యంతో దక్షిణ భారతదేశానికీ వెలుగులు పంచుతూ... మరో 16 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నూతన ప్లాంట్ నిర్మాణంలో ఉందని సునీల్ చెప్పారు. 

మారుమూల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పనికి కరెంటు తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ మొబిలిటీ, హైడ్రోజన్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిరంగంలో రామగుండం ఎన్టీపీసీ కి ఉజ్వల భవిష్యత్తు ఉందని సునీల్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

అతి తక్కువ సమయంలో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేసిన అధికారులను, కార్మికులను ఆయన అభినందించారు. డిజిటల్ ప్లాట్ ఫారంపై ప్రధాని మోడీ 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్భంగా అధికారులతో కలిసి సీజీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios