కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన మోడీ... గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏలిన కాంగ్రెస్ పార్టీని 70 ఏళ్లు ఏం చేశారని అడిగినందుకు తనను వ్యక్తిగతంగా అవమానిస్తున్నారని ప్రధాని అన్నారు.

మోడీ కులమేంటీ... ఆయన తల్లి వయసెంత.. ప్రధాని తండ్రి పేరేంటి అంటూ దూషణలకు దిగుతున్నారని మోడీ తెలిపారు. కాంగ్రెస్ వైఖరి గురించి తెలిసిన ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, గుజరాత్‌లలో ఆ పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ప్రధాని గుర్తు చేశారు. ఉద్యమంలో ఎంతోమందిని కాల్చి చంపి.. ఎన్నో కష్టాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని తిరిగి తెలంగాణలో అడుగుపెట్టనిస్తారా అని ఆయన జనాన్ని ప్రశ్నించారు. 

నిమ్మకాయ, మిరపకాయ అంటాడు...కేసీఆర్ నమ్మకాలపై మోడీ సెటైర్లు

కేసిఆర్ కు ట్రైనింగ్ ఇచ్చింది కాంగ్రెస్సే, ఇంటికి పంపండి: మోడీ

నిజామాబాద్ సభ: తెలుగులో మోడీ ప్రసంగం

బాబును కాను, అక్కడే తేల్చుకుందాం: మోడీకి కేసిఆర్ సవాల్