తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉపన్యాసానికి ముందు ఆయన తెలుగులో అందరికి నమస్కారాలు తెలిపారు. ‘‘ ఇందూరు ప్రజలందరికీ నా శుభాభినందనలు, బాసర సరస్వతి అమ్మవారి అశీస్సులతో, రజాకార్ల ఆగడాలను ధైర్యంగా ఎదిరించిన చరిత్ర గల భూమి ఇది.

మార్పు కోసం, ప్రగతి కోసం అమరవీరుల ఆకాంక్షల సాకారం కోసం తరలివచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు అంటూ ప్రధాని తెలుగులో మాట్లాడటంతో వేదిక మొత్తం చప్పట్లు, ఈలలతో మారుమోగిపోయింది. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకుని... అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ప్రధాని నిజామాబాద్ చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.