Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు ప్రధాని మోదీ అభినందనలు...

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. ఆ పార్టీ 2014 లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించి ప్రత్యర్థులను కోలుకోలేని  దెబ్బ తీసింది. ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

pm narendra modi congratulate telangana new cm kcr
Author
Hyderabad, First Published Dec 13, 2018, 6:43 PM IST

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. ఆ పార్టీ 2014 లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించి ప్రత్యర్థులను కోలుకోలేని  దెబ్బ తీసింది. ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ప్రధాని మోదీ నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ది చెందుతూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు మోదీ ప్రకటించారు. 

ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ అన్నీ తానై టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం నిర్వహించిన కేసీఆర్ పలువురు ప్రముఖులు అభినందించారు. తాజాగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios