ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరిన మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బీజేపీ నేతలు వీడ్కోలు పలికారు.

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. శని, ఆది వారాల్లో హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. శనివారం రాత్రి ప్రధాని మోదీ అక్కడికి సమీపంలో నోవాటెల్ హోటల్‌లో బస చేశారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం రాజ్‌భవన్ చేరుకని రాత్రి అక్కడే బస చేశారు. 

ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరిన మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బీజేపీ నేతలు వీడ్కోలు పలికారు. దీంతో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఇక, బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడి నుంచి భీమవరం వెళ్లి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు.