Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ గురువు చంద్రబాబు కాదా: మోదీ ప్రశ్న

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లకు కాంగ్రెస్‌ పార్టీయే గురువు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసులాంటి వాళ్లని అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వారసత్వ, కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

pm modi comments on telangana cm kcr
Author
Hyderabad, First Published Dec 3, 2018, 8:43 PM IST


హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లకు కాంగ్రెస్‌ పార్టీయే గురువు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసులాంటి వాళ్లని అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వారసత్వ, కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఎవరు ఎవరి జట్టో అందురికీ తెలుసునని, కేసీఆర్ యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది నిజం కాదా అని మోడీ అన్నారు. టీడీపిలో కేసీఆర్ అప్రెంటిస్ చేశారని, కేసీఆర్ గురువు చంద్రబాబు కాదా అని ఆయన అన్నారు. 

కాంగ్రెస్‌ -టీఆర్ఎస్ తెలంగాణలో పైకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా రెండు పార్టీల ఆలోచనా ఒక్కటేనన్నారు. యూపీఏ -1 ప్రభుత్వంలో కేసీఆర్‌ కేంద్రమంత్రి పదవి చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్‌ ఢిల్లీలో సోనియాగాంధీకి మొక్కలేదా? అని ప్రధాని ప్రశ్నించారు. 

దేశంలో మైనార్టీలకు రక్షణ లేదంటూ కొన్ని పార్టీలు విద్వేషాలు రెచ్చగొట్టేలా చూస్తున్నాయని మండిపడ్డారు. కుర్చీ కోసం దళితులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడమంటే అంబేడ్కర్‌ను అవమానించడమేనని మోదీ అన్నారు. 

ఎవరి మధ్య విభేదాలు రాకుండా ఆనాటి ప్రధాని వాజ్‌పేయీ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని, ఆ రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి వేగంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. 

కుటుంబ పార్టీలు ఓటు బ్యాంకు కోసం అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు. మధ్యతరగతి ప్రజల కోసం ఏ ప్రభుత్వమూ ఆలోచించలేదననారు. 2022లోపు ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారం చేయాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు మోదీ. 

మేడమ్‌ సోనియా గాంధీ రిమోట్‌ కంట్రోల్‌తో సాగిన పాలనలో సొంతింటి కల సాకారం కాలేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 12,50,000 ఇళ్లు నిర్మించామని మోదీ స్పష్టం చేశారు. కొత్త ఇళ్లలోనే ప్రజలు దీపావళి వేడుకలు చేసుకున్నారని గుర్తు చేశారు.  

యూపీఏ పదేళ్ల పాలనలో కేవలం 80వేల ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చారని మోదీ విమర్శించారు. వారసత్వం, కుటుంబ రాజకీయాలు లేని ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. ఒక కుటుంబం తెలంగాణను లూటీ చేస్తోందని, ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కూడా ఒక కుటుంబం చేతిలోనే చిక్కుకుపోయిందన్నారు. డిసెంబర్‌ 7 తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలు కనుమరుగైపోతాయని మోదీ వ్యాఖ్యానించారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీని అడ్డుకోవాలన్నది వారి చీకటి ఒప్పందం : మోదీ

Follow Us:
Download App:
  • android
  • ios