Asianet News TeluguAsianet News Telugu

గోవా,శ్రీలంకల్లో గుత్తా సుమన్ కుమార్ క్యాసినో కేంద్రాలు: దర్యాప్తులో కీలక విషయాలు

రెండు రోజలు పాటు గుత్తా సుమన్ కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. పోలీసుల విచారణలో సుమన్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారని సమాచారం. గోవా, శ్రీలంకల్లో క్యాసినో కేంద్రాలను నిర్వహించాడని పోలీసులు గుర్తించారు.

Playing Cards case:  Police found key information from Gutha Suman kumar
Author
Hyderabad, First Published Nov 4, 2021, 2:50 PM IST

హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో  Playing Cards నిర్వహించిన Gutha Suman Kumarను విచారించిన నార్సింగి పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. ప్రములను Goa, Srilankaకు తీసుకెళ్లి క్యాసినో కేంద్రాలు నిర్వహించాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

also read:నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: గుత్తా సుమన్‌కుమార్‌ను కస్టడీలోకి తీసుకొన్న నార్సింగి పోలీసులు

గత నెల 31న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవులలోని హీరో Naga Shourya  ఫామ్‌హౌస్ లో  పేకాట నిర్వహిస్తున్నవారిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి  తీసుకొన్నారు. ఈ ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులు కోర్టు నుండి బెయిల్ తెచ్చుకొన్నారు.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్ కుమార్ ను కోర్టు అనుమతితో నార్సింగి పోలీసులు ఈ నెల 3న కస్టడీలోకి తీసుకొన్నారు. రెండు రోజుల పాటు గుత్తా సుమన్‌కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. చర్లపల్లి జైలు నుండి సుమన్ కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు.

Andhra Pradesh, Telangana రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో సుమన్‌కుమార్ టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.  రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కూడా సుమన్‌కుమార్ కు సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. గోవా, శ్రీలంకలలో గుత్తా సుమన్ కుమార్ క్యాసినో సెంటర్లను నిర్వహించాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

మరో వైపు పేకాట కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల్లో సముమ్ కుమార్ ఛాటింగ్ చేసేవాడు.ఈ వాట్సాప్ గ్రూపుల్లోనే ప్రముఖులకు సుమన్ కుమార్ ఆహ్వానం పంపేవాడు. డిజిటల్ రూపంలో సుమన్ కుమార్ డబ్బులు తీసుకొనేవాడు.  అయితే ఈ డబ్బులు తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్  అందించేవాడు.ఇదిలా ఉంటే పేకాట ఆడే వారి నుండి సుమన్ కుమార్ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఒక్కో టేబుల్ కు రూ. 5 లక్షలను వసూలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేకాట ఆడదుతూ దొరికితే తనదే పూచీకత్తు అంటూ ఆయన వాట్సాప్ గ్రూపుల్లో ఛాటింగ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం ఉందని వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.

గుత్తా పవన్ కుమార్ హైద్రాబాద్ నగరంలోని స్టార్ హోటళ్లలో పేకాట ఆడిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసుల కీలక విషయాలను ప్రస్తావించారు. మరో వైపు సుమన్ కుమార్ పై ఉన్న కేసుల గురించి కూడా తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులను సంప్రదించారు.  ఏపీ పోలీసులు నార్సింగి పోలీసులకు  కీలక సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోవాకు బదులు నగర శివారులో గుత్తా సుమన్ కుమార్ పేకాట శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఫాంహౌస్‌ల్లో సకల సౌకర్యాలతో పేకాట శిబిరాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఎప్పట్నుంచి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మంచిరేవుల Farm House లీజ్ అగ్రిమెంట్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీజ్ అగ్రిమెంట్‌ను  యువ హీరో తండ్రి పోలీస్‌స్టేషన్‌లో సమర్పించారు. మంచిరేవుల ఫాంహౌస్ లీజ్ అగ్రిమెంట్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీజ్ అగ్రిమెంట్‌ను  యువ హీరో తండ్రి పోలీస్‌స్టేషన్‌లో సమర్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios