ఖమ్మం: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  గన్‌మెన్లను వెనక్కు పంపారు. ప్రజలే తనకు రక్షణగా నిలుస్తారని ఆయన  ప్రకటించారు.

తనకు ప్రభుత్వం సమకూర్చిన గన్‌మెన్లను తిప్పిపంపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.హంగు ఆర్బాటాలకు దూరంగా  ఉండాలని తాను భావిస్తున్నట్టుగా కాంతారావు ప్రకటించారు.తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. తన రక్షణను ప్రజలే చూసుకొంటారని రేగా కాంతారావు చెప్పారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు.