హుస్సేన్ సాగర్ ఎఫ్.టి.ఎల్ పరిధిలో భవనాల నిర్మాణంపై హైకోర్టులో పిల్ వేశారు సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. మంగళవారం పిల్ ను హైకోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం, జీ హెచ్ ఎమ్ సీ లకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం.

హుస్సేన్ సాగర్ ఎఫ్ టిఎల్ పరిధిలో భవనాలు నిర్మించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. దీనిపై న్యాయపోరాటానికి దిగారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వారం రోజుల్లోగా పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, జిహెచ్ఎంసికి నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను వచ్చే మంగళవారం కు వాయిదా వేసింది హైకోర్టు. సుప్రీంకోర్టు 2005 లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కోర్టు అనుమతి లేకుండా హుసేన్ సాగర్ లోపల కాని బయట కాని ఎలాంటి నిర్మాణం చేపట్ట కూడదు.
ఈ ఉత్తర్వు ను ప్రభుత్వం పాటించకుండా భవనాలు కట్టిస్తామంటూ ప్రకటనలు చేయడం, కసరత్తు చేయడంతో తాను హైకోర్టును ఆశ్రయించానని మర్రి పేర్కొన్నారు. లేకపోతె అంబేద్కర్ నగర్ వారికి చెప్పిన ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీమ్ ఆగిపోతుందుంది. బలవంతాన ఇండ్లను ఖాళీ చేయించినవారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారాయన.