Asianet News TeluguAsianet News Telugu

మోడీ బొమ్మ పెట్టరా : నిన్న నిర్మల.. నేడు పాండే, తెలంగాణలో బీజేపీ - టీఆర్ఎస్ మధ్య ‘‘ఫోటో’’ వార్

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్‌లు కత్తులు దూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ఎందుకు పెట్టరంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 

photo war between bjp and trs in telangana
Author
First Published Sep 3, 2022, 2:38 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య ఫోటో ఫైట్ నడుస్తోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. రేషన్ షాపుల ముందు కేసీఆర్ ఫ్లెక్సీ ఎందుకు లేదంటూ నిన్న నిర్మలా సీతారామన్ ప్రశ్నించగా... నేడు వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై తెలంగాణలో ఎందుకు ప్రధాని మోడీ ముద్రించడం లేదంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తోన్న మంత్రి పాండే.. శనివారం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ సెంటర్‌ను అడిగి తెలుసుకున్నారు. 

ఈ క్రమంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో లేకపోవడాన్ని మహేంద్రనాథ్ పాండే తప్పుబట్టారు. అన్ని రాష్ట్రాలు ప్రధాని ఫోటో పెడుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. కేవలం సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫోటో వుండటాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు కేసీఆర్ ఫోటోను కేంద్రంలో పెడతారా అని ప్రశ్నించిన హరీశ్ రావు వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటరిచ్చారు. కేసీఆర్ పగటి కలలు మానుకోవాలని పాండే హితవు పలికారు. 

ALso REad:దేశంలో మా డబ్బులూ వున్నాయి.. కేసీఆర్ ఫోటో పెడతారా : నిర్మలమ్మపై హరీశ్ ఫైర్, క్షమాపణలకు డిమాండ్

కాగా.. ప్రధాని స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలంటున్నారని.. బియ్యమంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని.. తెలంగాణ నిధులే కేంద్రానికి వెళ్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. కేంద్రంలో ముందుగా మా కేసీఆర్ ఫోటో పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. నోరు విప్పితే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని.. అబద్ధాలు చెప్పి నిజాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్ రావు చురకలు వేశారు. పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఏటా రూ.3,610 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios