రిపబ్లిక్ డే వేడుకలు అధికారికంగా నిర్వహించాలి:తెలంగాణ హైకోర్టులో పిటిషన్


రిపబ్లిక్ డే ఉత్సవాలను అదికారికంగా నిర్వహించాలని  బుధవారం నాడు తెలంగాణ  హైకోర్టులో  పిటిషన్ దాఖలైంది.

petition files in Telangana high Court on conduct  Republic day celebrations

హైదరాబాద్: రిపబ్లిక్ డే ఉత్సవాలను  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని  బుధశారం నాడు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్  పిటిషన్ దాఖలైంది.  రిపబ్లిక్ డే ఉత్సవాలను  నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్  జారీ చేసింది.అయితే  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం  రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడం లేదని  పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్  ను అత్యవసరంగా విచారించాలని  కోరారు.  దీంతో  ఈ పిటిషన్ ను ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు  తెలంగాణ హైకోర్టు విచారించనుంది.    గత ఏడాది మాదిరిగానే  రాజ్ భవన్ లోనే   రిపబ్లిక్ డే  వేడుకలను నిర్వహించాలని  గవర్నర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని  నిన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  ట్విట్టర్ వేదికగా  ప్రకటించారు. 

 రాష్ట్ర ప్రభుత్వానికి  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మధ్య  సఖ్యత లేకుండా పోయింది.   తమిళిసై సౌందర రాజన్  గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలం వరకు  వీరిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య  అంతరం పెరుగుతూ వస్తుంది. 

కౌశిక్ రెడ్డికి  ఎమ్మెల్సీ పదవి విషయమై  రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.ఈ అయితే ఈ ఫైల్ ను గవర్నర్ పక్కన పెట్టింది.  ఈ ఫైలును పరిశీలిస్తున్నట్టుగా ప్రకటించింది.   కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ  పదవికి ప్రతిపాదించిన  జాబితాపై  గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే  ప్రత్యామ్నాయ పద్దతిలో  కౌశిక్ రెడ్డికి  ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని అప్పగించింది. 

ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్ లో ఉంచడం వంటి విషయమై  మంత్రులు,  బీఆర్ఎస్ నేతలు  గవర్నర్ పై  నేరుగా విమర్శలు చేశారు.  మరో వైపు గవర్నర్  జిల్లాల పర్యటనలకు  వెళ్లిన సమయంలో  ప్రోటోకాల్ పాటించడం లేదు.  రాష్ట్రంలో చోటు  చేసుకున్న పరిణామాలపై గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

రిపబ్లిక్ డే  సందర్భంగా  ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠానికి బదులుగా  గవర్నర్  తన స్వంతంగా  ప్రసంగం విన్పించారని  అధికార పార్టీ  నేతలు గుర్తు చేస్తున్నారు.    ఈ పరిణామాల నేపథ్యంలో  గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య  అగాధం పెరిగింది. ఈ ప్రభావం  రాజ్ భవన్, ప్రభుత్వం మధ్య సంప్రదాయంగా  నిర్వహించే  కార్యక్రమాలపై పడింది. 

also read:గత ఏడాది మాదిరే: రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు

గత ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాలు  రాజ్ భవన్ కే పరిమితమయ్యాయి. ఈ ఏడాది కూడా  రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా రాజ్ భవన్ కే  పరిమితమయ్యాయి.  తెలంగాణ ఏర్పాటైన తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కోండ కోటలో నిర్వహిస్తున్నారు.  రిపబ్లిక్ డే ఉత్సవాలను పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నారు. కేసీఆర్, తమిళిసై మధ్య అగాధం కారణంా రిపబ్లిక్ డే ఉత్సవాలు రాజ్ భవన్ కే పరిమితం కావాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios