Asianet News TeluguAsianet News Telugu

బేగంబజార్ పరువు హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్: నిందితులకు రక్షణ కోరుతూ హెచ్ఆ‌ర్‌సీలో పిటిషన్

బేగం బజార్ పరువు హత్య కేసులో నిందితులకు రక్షణ కల్పించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. నిందితులను ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో హెచ్ఆర్‌సీలో పిటిషన్ దాఖలు చేశారు.
 

Petition Files in HRC For Protection To Accused in Begum Bazar honour killing
Author
Hyderabad, First Published May 27, 2022, 4:12 PM IST


హైదరాబాద్: నగరంలోని Begum Bazar  Honour Killing కేసులో నిందితులకు రక్షణ కల్పించాలని నిందితుల పేరేంట్స్  హెచ్ఆర్‌సీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మరో ఇద్దరు మైనర్లను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

బేగంబజార్ లో Neeraj Pawarను  ఆయన భార్య సంజన కుటుంబ సభ్యులు ఈ నెల  20వ తేదీ రాత్రి హత్య చేశారు. కర్రలు, రాడ్లతో ఆయనతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన నీరజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  ఈ ఘటనలో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ మరో ఇద్దరు మైనర్లను  అరెస్ట్ చేశారు. అయితే నిందితులను ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో నిందితుల పేరేంట్స్ తమ వారికి రక్షణ కల్పించాలని కోరుతూ ఇవాళ HRC లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సంబంధం లేని వారిని కూడా కేసులో ఇరికిస్తున్నారని పోలీసులపై నిందితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

aslo read:బేగం బజార్ పరువు హత్య: నిందితుల కస్టడీ కోరుతూ షాహినాత్‌గంజ్ పోలీసుల పిటిషన్

నీరజ్ కుమార్, సంజనలు గత ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్లితో తమ పరువు పోయిందని భావించిన సంజన కుటుంబ సభ్యులు నీరజ్ కుమార్ ను హత్య చేశారు.బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకన్న నీరజ్‌పై  ఆమె కుటుంబ సభ్యుల కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం Sanjana సోదరులు, వారి స్నేహితులు.. నీరజ్‌ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా  కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు.  తీవ్ర రక్తస్రావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ మృతిచెందాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. 

బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకన్న నీరజ్‌పై  ఆమె కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన రాత్రి  సంజన సోదరులు నీరజ్ పై దాడికి దిగారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ మృతిచెందాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios