బేగం బజార్ పరువు హత్య: నిందితుల కస్టడీ కోరుతూ షాహినాత్‌గంజ్ పోలీసుల పిటిషన్


బేగం బజార్ పరువు హత్య కేసులో నిందితుల కస్టడీ కోరుతూ షాహినాత్ గంజ్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై కోర్టు ఇవాళ విచారణ చేసే అవకాశం ఉంది.ఈ నెల 20వ తేదీన రాత్రి బేగం బజార్ లో నీరజ్ ను అతని భార్య బంధువులు హత్య చేశారు.

Begum Bazar Honour Killing: Shahinayathgunj Police Files Accused Custody Petition In Court

హైదరాబాద్: నగరంలోని Begum Bazar లో Honour Killing కి గురైన  Neeraj కేసులో నిందితులను వారం రోజుల కస్టడీ కోరుతూ Shahinayathgunj పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై కోర్టు మంగళవారం నాడు విచారణ చేసే అవకాశం ఉంది.

ఈ నెల 20 వ తేదీన రాత్రి  Hyderabad బేగం బజార్ లో నీరజ్ కుమార్ ను అతని భార్య సంజన బంధువులు దారుణంగా హత్య చేశారు. నీరజ్ కుమార్, సంజనలు గత ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్లితో తమ పరువు పోయిందని భావించిన సంజన కుటుంబ సభ్యులు నీరజ్ కుమార్ ను హత్య చేశారు.

బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకన్న నీరజ్‌పై  ఆమె కుటుంబ సభ్యుల కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రంగా Sanjana సోదరులు, వారి స్నేహితులు.. నీరజ్‌ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు.  తీవ్ర రక్తస్రావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ మృతిచెందాడు. 

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు నలుగురిని  అరెస్ట్ చేశారు. వారిలో విజయ్ యాదవ్, సంజయ్‌ యాదవ్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరిని ఆదివారం సాయంత్రం 16వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిస్తే  రిమాండ్ విధించాడు. దీంతో ఇద్దరు నిందితులను చంచల్‌గూడ జైలుకు, మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు అభినందన్ యాదవ్, మహేష్ యాదవ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని సంజన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పించారు. 

బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకన్న నీరజ్‌పై  ఆమె కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం సంజన సోదరులు, వారి స్నేహితులు నీరజ్‌ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు.  తీవ్ర రక్తస్రావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ మృతిచెందాడు. 

ఈ కేసుకు సంబంధించి Police ఇప్పటివరకు ఐదుగురిని  అరెస్ట్ చేశారు. వారిలో విజయ్ యాదవ్, సంజయ్‌ యాదవ్‌తో పాటు మరో ముగ్గురున్నారు. వీరిని ఆదివారం సాయంత్రం 16వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో హాజరుపర్చారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఈ కేసులో  ఇద్దరు నిందితులు మైనర్లే. మైనర్లను జువైనల్ హోంకు తరలించారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు  గాలిస్తున్నారు. మరోవైపు తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని సంజన ఆందోళన వ్యక్తం చేస్తుంది. సంజనకు పోలీసులు భద్రత కల్పించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios