హైదరాబాద్: ఓ దినపత్రిక రిపోర్టర్ సంతోష్ నాయక్ ను బెదిరించిన కేసులో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది.

భూ కబ్జాలపై రిపోర్టర్ సంతోష్ నాయక్ వార్త రాసినందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ లో దూషించాడు.ఈ విషయమై రిపోర్టర్ సంతోష్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు  నమోదైంది.

also read:రిపోర్టర్‌కు బెదిరింపులు: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కేసు నమోదు

సంతోష్ నాయక్ ను ఎమ్మెల్యే బెదిరించిన ఆడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలు కూడ నిర్వహించాయి.

ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం లేదని  తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.పోలీసులు ఎమ్మెల్యేపై నామమాత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని ఆ పిటిషనర్ ఆరోపించారు.  ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.

ఈ పిటిషన్ పై తన న్యాయవాది చూసుకొంటారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.జర్నలిస్ట్ ను బెదిరించినందుకు  ఎమ్మెల్యేపై ఐపీసీ 109, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.