అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.. : బండి సంజ‌య్

Hyderabad: ప్రజలు మరోసారి బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే రాష్ట్ర అప్పులు రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు పెరుగుతాయని బీజేపీ లీడ‌ర్, ఎంపీ బండి సంజ‌య్ కుమార్ అన్నారు. "కాంగ్రెస్ కు వారెంటీ లేదు. దాని హామీలను ప్రజలు ఎలా నమ్ముతారు? 50 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ పరిణతి సాధించారని వారు అంటున్నారు. అలా అనడం ద్వారా ఇన్నాళ్లూ రాహుల్ గాంధీకి తనకంటూ పరిణతి చెందిన మనస్సు లేదని ఈ కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు" అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

people will teach the BRS a lesson in the assembly elections. : BJP leader Bandi Sanjay Kumar RMA

BJP leader Bandi Sanjay Kumar: గత  రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోల అమలుకు నోచుకోని వాగ్దానాలతో ముందుకు సాగింద‌నీ,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కు ప్ర‌జ‌లు తగిన గుణ‌పాఠం చెబుతారని బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌, చంద్రశేఖర్‌రావు తమ మేనిఫెస్టోల ద్వారా ప్రజలకు ఏ హామీ ఇచ్చినా ప్రజలు ప‌ట్టించుకోర‌నీ, ఈ ఫూలింగ్ గేమ్ వారికి సరిపోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంల‌ను కూడా చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా పవిత్రంగా పరిగణిస్తానని చంద్రశేఖర్‌రావు పదే పదే ప్రగల్భాలు పలుకుతున్నారనీ, అయితే, 2014, 2019 ఎన్నికల్లో గెలిచాక తన పార్టీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని ఆరోపించారు. 

ఎన్నికల్లో గెలుపొందేందుకు బీఆర్‌ఎస్ కుట్ర పన్నుతున్నదని ఆయన అన్నారు. "అందుకే వారు వ్యూహాత్మక ప్రదేశాలలో కొంతమంది విశ్వసనీయ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం మినహా వివిధ శాఖల అధికారులందరినీ బదిలీ చేసింది. ఈ విషయాన్ని బీజేపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళుతుంది" అని బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఎన్ని సర్వేలు వచ్చినా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రానికి ఉన్న 5 లక్షల కోట్ల అప్పులను 10 లక్షల కోట్లకు పెంచుతారని ఆరోపించారు.  "కాంగ్రెస్ కు వారెంటీ లేదు. దాని హామీలను ప్రజలు ఎలా నమ్ముతారు? 50 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ పరిణతి సాధించారని వారు అంటున్నారు. అలా అనడం ద్వారా ఇన్నాళ్లూ రాహుల్ గాంధీకి తనకంటూ పరిణతి చెందిన మనస్సు లేదని ఈ కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు" అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎంఐఎం మనుగడ కోసం పూర్తిగా ఇతర పార్టీలపైనే ఆధారపడి ఉందనీ, ఎంఐఎంకు దమ్ముంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని స‌వాలు విసిరారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు, భూకబ్జాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహించలేకపోతున్నారని బీజేపీ నేత ఆరోపించారు. అందుకే రాష్ట్రంలోని ప్ర‌జ‌లు కొత్త ప్ర‌భుత్వం కోసం, అధికార మార్పు కోసం ఎదురుచూస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనులూ మోడీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే జరుగుతున్నాయన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు ఇచ్చే డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. త‌మ‌కు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనీ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయబోతోందని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios