Asianet News TeluguAsianet News Telugu

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ఉదయం కాంగ్రెస్ కండువా, సాయంత్రం గులాబీ జెండా

దయాకర్‌రెడిని కాదని కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ రియల్టర్‌కు మేయర్‌ పదవి ఖరారు అయిందన్న ప్రచారం నేపథ్యంలో మనస్థాపం చెందిన దర్గ దయాకర్‌రెడ్డి శుక్రవారం ఉదయం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Peerzadiguda Darga Dayakar Reddy Joined In Congress and Quit
Author
Hyderabad, First Published Jan 11, 2020, 2:51 PM IST

మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ ఎన్నికల ఓటింగ్ కి ఇంకా పది రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో... టికెట్ దక్కించుకోవాలనుకునే ఆశావాహులు... పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఓ పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. 

అయితే... ఓ వ్యక్తి మాత్రం టీఆర్ఎస్ లో ఉండి టికెట్ దక్కలేదని... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అక్కడికి వెళ్లి కొద్ది గంటలు కూడా గడవక ముందే మళ్లీ సొంత పార్టీ గూటికి చేరిపోయారు.  

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫీర్జాదిగూడ గ్రామంగా ఉన్నప్పుడు ఉప సర్పంచ్‌గా ఉన్న దర్గ దయాకర్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ బలోపేతానికి బాగా పనిచేశారన్న గుర్తింపు ఉంది. అయితే, ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అధిపత్య పోరుతో అప్పటి ఎంపీ, ప్రస్తుత మేడ్చల్‌ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యతిరేక వర్గీయుడిగా దయాకర్‌రెడ్డిపై ముద్ర పడింది.

Also Read తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు 2020: టిఆర్ఎస్ కొంపముంచే స్థానాలు ఇవే.

ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో దయాకర్‌రెడ్డి ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, చివరి దశలో దయాకర్‌రెడిని కాదని కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ రియల్టర్‌కు మేయర్‌ పదవి ఖరారు అయిందన్న ప్రచారం నేపథ్యంలో మనస్థాపం చెందిన దర్గ దయాకర్‌రెడ్డి శుక్రవారం ఉదయం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

 ఇది తెలుసుకున్న మంత్రి మాల్లారెడ్డి తన అల్లుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ పార్టీ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి దయాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అరగంటకు పైగా సాగిన చర్చల అనంతరం దర్గదయాకర్‌రెడ్డిని మంత్రి మల్లారెడ్డి బోయినపల్లిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి వరకు ఫీర్జాదిగూడ పార్టీ ఇన్‌చార్జి, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాస్‌రెడ్డితో పా టు పార్టీ ముఖ్య నేతలతో కలిసి బుజ్జగించారు. దీంతో మొత్తబడ్డ దయాకర్‌రెడ్డి మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios