పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024
ఎస్సీలకు రిజర్వ్ అయిన పెద్దపల్లిలో బయటి నేతలను తీసుకొచ్చి బరిలోకి దించాయి ఆయా పార్టీలు. కార్మిక నేతలు కోదాటి రాజమల్లు, జీ వెంకటస్వామి వంటి నేతలు పెద్దపల్లి నుంచి ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. పెద్దపల్లి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ‘‘కాకా’’నే. పారిశ్రామికంగా , శ్రామిక వర్గాలకు పట్టున్న పెద్దపల్లిని ‘‘మాంచెస్తర్ ఆఫ్ ఇండియా’’ గా కూడా పిలుస్తారు. సింగరేణి గనులు, ఎన్టీపీసీ , కేశోరాం సిమెంట్ ఫ్యాక్టీ, ఎఫ్‌సీఐ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే వున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విస్తరించి వుంది. ఈ సెగ్మెంట్ మీదుగా 63వ జాతీయ రహదారి వెళ్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పెద్దపల్లిది ప్రత్యేక స్థానం. పారిశ్రామికంగా , శ్రామిక వర్గాలకు పట్టున్న పెద్దపల్లిని ‘‘మాంచెస్తర్ ఆఫ్ ఇండియా’’ గా కూడా పిలుస్తారు. సింగరేణి గనులు, ఎన్టీపీసీ , కేశోరాం సిమెంట్ ఫ్యాక్టీ, ఎఫ్‌సీఐ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే వున్నాయి. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన పెద్దపల్లిలో ఎక్కువ శాతం నాన్ లోకల్ అభ్యర్ధులే విజయం సాధించారు.
ఎస్సీలకు రిజర్వ్ అయిన పెద్దపల్లిలో బయటి నేతలను తీసుకొచ్చి బరిలోకి దించాయి ఆయా పార్టీలు. కార్మిక నేతలు కోదాటి రాజమల్లు, జీ వెంకటస్వామి వంటి నేతలు పెద్దపల్లి నుంచి ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. పెద్దపల్లి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ‘‘కాకా’’నే. ఆయన తర్వాత వెంకటస్వామి కుమారుడు వివేక్ ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు.
పెద్దపల్లి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాకా ఫ్యామిలీకి అడ్డా :
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విస్తరించి వుంది. ఈ సెగ్మెంట్ మీదుగా 63వ జాతీయ రహదారి వెళ్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 1962లో ఏర్పడిన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం తొలినాళ్లలో కాంగ్రెస్‌కు కంచుకోటగా వుండగా.. ఆ తర్వాత టీడీపీ హవా నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పెద్దపల్లిని తన కంచుకోటగా మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, టీడీపీ 3 సార్లు, బీఆర్ఎస్ 2 సార్లు, ఇతరులు ఒకసారి విజయం సాధించారు.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో 2019 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 1425,355 మంది. వీరిలో 7,25,765 మంది పురుషులు.. 6,99,474 మంది ఓటర్లు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి నేత వెంకటేష్‌కు 4,41,321 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి ఆగం చంద్రశేఖర్‌కు 3,46,141 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి సోగాల కుమార్‌కు 92,606 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్ధి 95,180 ఓట్ల మెజారిటీతో పెద్దపల్లిలో విజయం సాధించారు.
పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ వ్యూహాలు :
పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాలకు ఏడు గెలిచి ఊపు మీద వున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పరిస్దితులు అనుకూలంగా వుండటంతో పెద్దపల్లిని దక్కించుకోవడం పెద్ద కష్టం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చివరిసారిగా 2009లో గెలిచింది. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ పెద్దపల్లిలో పాగా వేయాలని భావిస్తోన్న హస్తం పార్టీ అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ నేత, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు.
అయితే గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎంపీ సుగుణ కుమారి, ఊట్ల వరప్రసాద్, ఆసంపల్లి శ్రీనివాస్, పెర్కశ్యాం, గజ్జల కాంతం పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. స్థానికంగా మాదిగ సామాజికవర్గం బలంగా వుండటతో ఆ వర్గానికే టికెట్ కేటాయించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ఇతర ముఖ్యనేతల అభిప్రాయాలను కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపారు.
బీఆర్ఎస్ విషయానికి వస్తే.. మరోసారి పెద్దపల్లిలో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యనేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆయన లోక్‌సభ ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. బీఎస్పీ పొత్తు కూడా కలిసి రావడంతో పెద్దపల్లిలో బీఆర్ఎస్ బలం పెరిగినట్లయ్యింది. పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. త్వరలో బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ సంగతి చూస్తే.. పెద్దపల్లి టికెట్ కోసం పార్టీలో చాలా మంది ఆశావహులు వున్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జాడి బాల్ రెడ్డి, మిట్టపల్లి రాజేందర్ కుమార్, అయోధ్య రవి, క్యాతం వెంకట రమణలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
- All India Majlis e Ittehadul Muslimeen
- anumula revanth reddy
- bharat rashtra samithi
- bharatiya janata party
- congress
- general elections 2024
- harish rao
- kalvakuntla chandrashekar rao
- kalvakuntla kavitha
- kalvakuntla taraka rama rao
- lok sabha elections 2024
- parliament elections 2024
- peddapalli Lok Sabha constituency
- peddapalli lok sabha elections result 2024
- peddapalli lok sabha elections result 2024 live updates
- peddapalli parliament constituency