కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర సిరిసిల్ల జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటిఆర్ మీద పిసిస చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బూతులు కురిపించారు. ఉత్తమ్ ఏం మాట్లాడారో చదవండి.

ఇసుక అక్రమరవాణా తో  వేల కోట్లు కేటీఆర్ దోచుకుంటున్నారు. ఇసుక లారీల ఓవర్ స్పీడ్ వల్ల ఎంతో మంది చనిపోయారు. అక్రమ  ఇసుక రవాణా ను అడ్డుకున్నందుకు దళితులను థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దుర్మార్గుల ప్రభుత్వం ఇది. కేటీఆర్ ఓ లుచ్చా.. కేటీఆర్ ఒక జోకర్. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ కి బుద్ధి చెప్పాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తాం. టిఆర్ఎస్ పాలనలో మహిళలకు, రైతులకు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు భర్తీ చేయలేని అసమర్థ సీఎం కెసిఆర్. కేటీఆర్ మంత్రి అయ్యాక ఉద్యోగాలు తగ్గిపోయాయి. దేశ రక్షణ గూర్చి తెలియని వాళ్ళు నాపై నిందలు వేస్తే...స్పందించాల్సిన అవసరం లేదు.

పిట్టకథలు చెప్తే తెలంగాణ రాలేదు : షబ్బీర్ అలీ

కెసిఆర్ పిట్టకథలు చెప్పడం వల్ల తెలంగాణ రాలేదన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. చేనేత కార్మికులు పిట్టల్లా రాలుతుంటే...కేటీఆర్ ఎం చేస్తున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికుల కు ఉచిత కరెంటు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. డిపాజిట్ గల్లంతు అయ్యేలా కేటీఆర్ ను తరిమికొట్టాలి.