కేసిఆర్ సర్కారుపై మరో అవినీతి మరక

pcc uttam alleges new scam in land passbooks printing
Highlights

85 కోట్ల కుంభకోణం

తెలంగాణ సర్కారుపై మరో అవినీతి ఆరోపణ గుప్పించారు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...

కెసిఆర్ సర్కార్ కుంభకోణ సర్కార్ గా మారిపోయింది. భూముల పాస్ బుక్ ల ప్రింటింగ్, తయారీలో భారీ కుంభకోణం జరిగింది. దీనిపై సర్కార్ జ్యుడిషియల్ ఎంక్వయిరి వేయాలి. రైతుల పాస్ బుక్కుల ప్రింటింగ్ కోసం ప్రింటర్ కు 160 రూపాయలు ఇస్తున్నారు. బయట ఇవే పాస్ బుక్ లను మిగితా ప్రింటర్లు.... 50 రూపాయలకే ప్రింట్ చేసి ఇస్తామనంటున్నారు. వాటర్ ప్రూఫ్, టాంపర్ ఫ్రూఫ్ అని సీఎం అసెంబ్లీ లో ఎంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడిచ్చే పాస్ బుక్ లో ఆ రెండూ లేవు. 26 ఫీచర్లతో పాస్ బుక్ లు ఉంటాయన్నారు. ఇప్పుడు 18 ఫీచర్లకు పాస్ బుక్ లను కుదించారు.

జనవరి 26 నుంచి పాస్ బుక్ ల పంపిణీ చేస్తామన్నారు. తర్వాత మార్చ్ 11 కు పాస్ బుక్ లను రాష్ట్రపతి/ప్రధానిని ఆహ్వానించి పంపిణీ చేస్తామన్నారు. పాస్ బుక్ ల తయారీలో 85 కోట్ల కుంభకోణం జరిగింది. ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం దారుణం. అర్హత లేని కంపెనీలకు ..కూడా పాస్ బుక్ ల ముద్రణ పనులు ఇచ్చారు. 160 కంటే తక్కువ కోట్ చేసిన వాళ్లకు ఇవ్వలేదు.

పాస్ బుక్ లను ప్రభుత్వ మింట్ కాంపౌండ్ లో ప్రింటింగ్ చేస్తామన్నారు. వీటికి నాలుగు ప్రింటింగ్ ప్రెస్ లు ఉన్నాయన్నారు. కానీ దీనికి భిన్నంగా ప్రైవేట్ కంపెనీలకు ప్రింటింగ్ కు ఇచ్చారు. పాస్ బుక్ లలో నకిలీ /ఫోర్జరీ జరిగితే మాకు సంబంధం లేదని...పాస్ బుక్ ల ముద్రణ లోపభూయిష్టంగా ఉందని, తాము విత్ డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్(spp) తరపున సిఎస్ శైలేంద్ర కుమార్ జోషి కి లేఖ రాశారని చెప్పారు.

ఇప్పుడు మద్రాస్ టెక్నాలజీస్ (బ్లాక్ లిస్టు), మణిపాల్ టెక్నాలజీస్, కె. ఎల్. హై టెక్ సెక్యూరిటీ, శ్రీనిధి సెక్యూర్ (బ్యాంకాక్, ఇది బ్లాక్ లిస్ట్) తదితర ప్రైవేట్  ప్రింటింగ్ ప్రెస్ లకు అర్డర్ ఇచ్చారు. ఈ కుంభకోణంపై పోరాటం తప్పదు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader