Asianet News TeluguAsianet News Telugu

అందుకే కేసీఆర్ గుండెల్లో గుబులు: కాంగ్రెస్

 పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రకటించిన పెన్షన్ స్కీమ్ కారణంగా టీఆర్ఎస్‌ నేతల కాళ్ల కింద భూమి కంపించిపోతోందని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు

pcc spoksperson indirashoban slams on kcr
Author
Hyderabad, First Published Aug 21, 2018, 5:10 PM IST

హైదరాబాద్: పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రకటించిన పెన్షన్ స్కీమ్ కారణంగా టీఆర్ఎస్‌ నేతల కాళ్ల కింద భూమి కంపించిపోతోందని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు. 

మంగళవారంనాడు  గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 2011లో  కాంగ్రెస్ పార్టీ  పెన్షన్ తీసుకొనేందుకు  వయస్సును 65 నుండి 60 ఏళ్లకు తగ్గిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచిందని ఆమె విమర్శించారు.

పెన్షన్  వయస్సు 60 నుండి 65కు పెంచడం వల్ల కేంద్రం నుండి వస్తోన్న నిధులను కూడ  తెలంగాణ సర్కారే తింటోందని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ పెన్షన్ స్కీమ్ కారణంగా కుటుంబాల్లో గొడవలు చోటు చేసుకొంటున్నాయని  ఆమె ఆరోపించారు.

బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేందుకు పెట్టే శ్రద్ద తెలంగాణ అభివృద్ధిపై కేటాయిస్తే ప్రయోజనంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడడారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీకే  ఫలితాలు దక్కుతున్నాయని ఆమె విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios