హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై  సంచలన వ్యాఖ్యలు చేసిన  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని  టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నాయకత్వం మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని పీసీసీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది

పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని  పీసీసీ నాయకత్వం భావిస్తోంది. ఈ విషయమై వెంటనే నోటీసులు జారీ చేయాలని  పీసీసీ  నిర్ణయం తీసుకొంది.

పార్టీ నాయకులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  పీసీసీ క్రమశిక్షణ సంఘం సీరియస్‌గా తీసుకొంది. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేయనుంది.రాజగోపాల్ రెడ్డి వివరణ ఆధారంగా ఆయనపై కఠిన చర్యలకు కూడ వెనుకాడే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నేత రామ్ మాధవ్ ను రాజగోపాల్ రెడ్డి కలిశారని ప్రచరాం సాగుతోంది. ఈ తరుణంలో  రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నాయి.