హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకొనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  రంగం సిద్దం చేసింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  సోమవారం నాడు సమావేశమైంది.

మూడు రోజుల క్రితం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని  నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. ఈ కారణంగానే పార్టీ నాయకత్వంపై విమర్శలు చేశారని చెబుతున్నారు.

బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు  ఢిల్లీకి వెళ్లారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

బీజేపీలోకి కోమటిరెడ్డి: కాంగ్రెస్ నిర్ణయం తర్వాతే స్టెప్

బీజేపీ వైపు చూపు: కోమటిరెడ్డికి పీసీసీ నోటీసులు జారీ

బీజేపీ నేతలతో భేటీకి కోమటిరెడ్డి ఢిల్లీ పయనం