తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్న కేసీఆర్: ఉత్తమ్

First Published 6, Sep 2018, 2:50 PM IST
Pcc chief uttam kumar reddy on kcr
Highlights

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సరైన కారణం చెప్పకుండా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ రద్దు చెయ్యడమంటే కేసీఆర్ తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా వాళ్ల పదవి కాలాన్ని ముందే విరమించుకొన్నారంటూ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సరైన కారణం చెప్పకుండా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ రద్దు చెయ్యడమంటే కేసీఆర్ తన అంతాన్ని తానే కొని తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా వాళ్ల పదవి కాలాన్ని ముందే విరమించుకొన్నారంటూ ఎద్దేవా చేశారు.

 రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించామని మేనిఫోస్టో చూసి టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందన్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, టిక్కెట్ల కేటాయింపు, ఎన్నికల ప్రచార వ్యూహాలపై వార్ రూమ్ లో రాహుల్ గాంధీతో చర్చించారు. 

loader