తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా.. ఇప్పటి వరకు 18మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా... ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహిచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫీజు చెల్లింపు నుంచి ఫలితాల వెల్లడి వరకూ విద్యార్థుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసి నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అధికారులు ఎదురుదాడి చేసేలా మాట్లాడటం దారుణం అన్నారు. 

విద్యార్థులకు ఉచితంగా రీవాల్యూయేషన్, రీవేరిఫికేషన్ చేయాలన్నారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. తప్పిదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.