Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 2019: తెలంగాణలో పవన్ ప్లాన్ ఇదే

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడును పెంచిన పవన్ కళ్యాణ్ ... ఇక తెలంగాణలో కూడ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నారు.

Pawan kalyan plans to strenthen janasena in Telangana
Author
Hyderabad, First Published Aug 19, 2018, 7:05 AM IST

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడును పెంచిన పవన్ కళ్యాణ్ ... ఇక తెలంగాణలో కూడ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నారు. తెలంగాణలో ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

తెలంగాణలో కూడ జనసేనను మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అన్ని చర్యలను చేపట్టారు. జిల్లా, గ్రామ, మండల, రాష్ట్ర సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఏపీ రాష్ట్రంపైనే ఇంతకాలం ఎక్కువగా సమయాన్ని కేటాయించిన పవన్ కళ్యాణ్ .. ఇక తెలంగాణపై కూడ కేంద్రీకరించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయననున్నట్టు ఆయన ఇదివరకే ప్రకటించారు. దరిమిలా రెండు రాష్ట్రాల్లో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీతో పాటు, గ్రేటర్ హైద్రాబాద్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు కమిటీలతో పాటు ఆయా జిల్లాల్లో జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.ఈ కమిటీలు ఆయా  ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే చర్యలను తీసుకొంటున్నారు.తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ చర్చించారు.

తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలు, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలను రెండు, మూడు వారాల్లో ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.

తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చే పార్టీలతో ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడ ఈ సమావేశంలో చర్చించారు.అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేసే విషయమై కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios