తెలంగాణలో సీపీఎంతో పొత్తు తేల్చే పనిలో పవన్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Aug 2018, 3:35 PM IST
pawan kalyan meets janasena political advisory committee
Highlights

జనసేన పార్టీ కార్యకలాపాలను స్పష్టమైన ప్రణాళిక ప్రకారం చురుగ్గా ముందుకు వెళ్లాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం ఉదయం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీతో పవన్ సమావేశమయ్యారు

జనసేన పార్టీ కార్యకలాపాలను స్పష్టమైన ప్రణాళిక ప్రకారం చురుగ్గా ముందుకు వెళ్లాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం ఉదయం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన చేపట్టాల్సిన కార్యకలాపాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.

ఇందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను కమిటీకి ఆయన వివరించారు. వాడ వాడకీ జనసేన జెండా కార్యక్రమంతో పాటు.. పార్టీ విజన్ డాక్యుమెంట్ ఉద్దేశ్యాలను ప్రజల్లోకి తీసుకెళుతూ పార్టీ శ్రేణులు ఎప్పుడూ ప్రజలకు చేరువలో ఉండాలని స్పష్టం చేశారు.

అలాగే తెలంగాణ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఉందన్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యలపై రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించారు. దీనిపై సెప్టెంబర్ 2వ తేది మధ్యాహ్నం 3 గంటలకు జనసేన కార్యాలయంలో.. జనసేన, సీపీఎం మధ్య ప్రాథమిక చర్చలు జరుగుతాయని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 
 

loader