తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విహెచ్ అలియాస్ వి.హన్మంతరావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సమస్యలే కనబడతలేవా? తనతో వస్తే తెలంగాణ సమస్యలు చూపిస్తానని విహెచ్ నిన్న పవన్ పై విమర్శల వర్షం కురిపించారు.

దీంతో ఖమ్మంలో జరిగిన సభలో విహెచ్ చేసిన కామెంట్లపై పవన్ స్పందించారు. నిజంగా విహెచ్ ను తెలంగాణ సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తే.. తాను తప్పకుండా విహెచ్ తో నడుస్తానని ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలందరిపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఎవరితోనూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. మూడున్నరేళ్ల  పసిగుడ్డు తెలంగాణను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని కాంగ్రెస్ నేతలకు విన్నవించారు.

ఖమ్మంలో జరిగిన సభలో సెల్ఫీలు దిగాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆరాటపడ్డారు. వారి తాపత్రయాన్ని గుర్తించిన పవన్.. సమయం ఉన్నప్పుడల్లా సెల్ఫీలు దిగుతానని హామీ ఇచ్చారు. అయితే సెల్ఫీలే దిగుతూ ఉంటే.. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ కార్యకర్తలతో ఖమ్మంలో సభ జరిగింది.