బ్రేకింగ్ న్యూస్.. టివి9 ఆఫీసుకు భారీ భద్రత

బ్రేకింగ్ న్యూస్.. టివి9 ఆఫీసుకు భారీ భద్రత

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఒక సామెత ఉంది. మనందరికి తెలిసిందే ఆ సామెత. ఇప్పుడు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు మీడియా సంస్థల మెడకు చుట్టుకుంటున్నాయి. సినీ హీరోయిన్ గా చెలామణి అవుతున్న శ్రీరెడ్డి అనే మహిళ పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రంగా అవమానించేలా కామెంట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ గత మూడు నాలుగు రోజులుగా రగిలిపోతున్నారు.

శ్రీరెడ్డి తర్వాత పవన్ కు, ఆయన తల్లికి క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉన్నది. శ్రీరెడ్డి వెనుక ఎవరెవరున్నారో వివరాలను శుక్రవారం ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బయటపెట్టారు. టివి9 చానెల్ ఈ వ్యవహారంలో తెర వెనుక కుట్ర చేసిందని పవన్ ఆరోపించారు. అలాగే ఎబిఎన్ టివి అధిపతి వేమూరి రాధాకృష్ణ కూడా ఉన్నట్లు పవన్ ఆరోపించారు.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం పవన్ ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చారు. అయితే ఇదే సమయంలో అక్కడ కవరేజీకి వచ్చిన ఎబిఎన్ టివి కారు అద్దాలను పవన్ ఫ్యాన్స్ పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో టివి 9 ఆఫీసు మీద పవన్ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టివి9 ఆఫీసు చుట్టూ బలగాలు మొహరించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలోనూ టివి9, ఎబిఎన్ లాంటి ఛానళ్లను తెలంగాణవాదులు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వపన్ ఫ్యాన్స్ కూడా ఈ రెండు చానెళ్లను టార్గెట్ చేయడం గమనార్హం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page